Rakul : తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి, టాలీవుడ్ లో మంచి గుర్తింపు సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన కెరీర్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆమెకు కాలం కలిసి రావడం లేదు. ఆమె ఖాతాలో మరో ఫ్లాప్ చేరుకుంది. అర్జున్ కపూర్ హీరోగా నటించిన ‘మేరే హస్బెండ్ కీ బివి’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నెకర్ కథానాయికలుగా నటించారు.
ఈ సినిమాకు విడుదలయ్యే ముందు నుంచే పెద్ద బజ్ లేదు. ప్రచారం కూడా తక్కువగా జరిగింది. విడుదలతో సినిమాకు ఓపెనింగ్ కూడా అనుకున్నట్లు లభించలేదు. కొన్ని స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, 1 ప్లస్ 1 ఆఫర్ (ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం) కూడా ఇచ్చారు. కానీ, ఈ ఆఫర్ కూడా పెద్దగా ప్రజలను ఆకర్షించలేదు.
Read Also:Justin Trudeau: అమెరికాని ఓడించిన కెనడా.. ట్రంప్‌కి ట్రూడో స్ట్రాంగ్ రిఫ్లై..
మొదటి రోజుకు బాక్సాఫీస్ వసూళ్లు కేవలం రూ. 2 కోట్లకే పరిమితమయ్యాయి. వీకెండ్ లో కొంత రెవెన్యూ పెరిగే అవకాశాలు ఉన్నా, సినిమా లాంగ్ రన్‌లో కనీసం రూ. 20 కోట్లను కూడా దాటదన్న టాక్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
రకుల్ ఈ సినిమా పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది. ఆమె పాత్రకు ప్రాముఖ్యత కలిగి ఉండడంతో, హిట్ అయితే బాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లను అందుకుంటానని ఆశించసాగింది. కానీ, ఈ సినిమా ఫ్లాప్ కావడంతో, ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పొందడం ఇంకా కష్టమవుతుంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఈ సినిమా నిరాశే మిగిల్చింది.
Read Also:APPSC vs AP Government: గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..!