Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ కే పరిమితమయ్యిందా..? అంటే అవును అనే మాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేదు. బాలీవుడ్ మీదనే ఫోకస్ చేసిన ఈ చిన్నది అక్కడ కూడా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక వీలు చిక్కినప్పుడల్లా.. రకుల్ సోషల్ మీడియాలో హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ఇక తాజాగా ఈ చిన్నది గడ్డకట్టే చలిలో.. సాహసమే చేసింది అని చెప్పాలి. ఈ మధ్యనే రకుల్ క్రయో థెరపీ చేయించుకుంది. ఈ థెరపీ ఏంటంటే.. మైనస్ 15 డిగ్రీల చలిలో గడ్డ కట్టిన నీళ్లల్లో బికినీతో మునగాలి.
Bellamkonda Srinivas: సమంత, తమన్నా లకు ఆ వీడియోలు పంపా.. అందుకే ఒప్పుకున్నారు
సాధారణంగా చలి ప్రదేశాల్లో చేతులు కనిపించేలా డ్రెస్ వేసుకొంటేనే ఆ చలికి చచ్చిపోతారేమో అనిపిస్తుంది. కానీ, రకుల్ మాత్రం బికినీ లో, గడ్డకట్టిన నీళ్ళల్లో అమాంతం మునిగి పైకి వచ్చి.. ఔరా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఎందుకు ఈ థెరపీ అని అడుగుతుండగా.. ఇంకొంతమంది బికినీ లో హాట్ గా ఉన్నావని చెప్పుకొస్తున్నారు. ఇక రకుల్ కెరీర్ విషయానికొస్తే.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 లో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమా కాకుండా తెలుగులో ఏమైనా అవకాశాలను ముందు ముందు అందుకుంటుందేమో చూడాలి. లేకపోతే ప్రేమించిన భగ్నానీ వివాహమాడి హౌజ్ వైఫ్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి అంటున్నారు అభిమానులు.