Site icon NTV Telugu

Rakshabandhan: బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి.. వైరల్ వీడియో

Rakshabandhan Balakrishna

Rakshabandhan Balakrishna

Rakshabandhan: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టింది. ఆ తర్వాత ఇరువురు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేడుకగా పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి వీడియోని షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సందేశాన్ని తెలిపింది. ఈ సందేశంలో..

Bihar Elections: ఓట్ల సర్వేపై ఏ పార్టీ అభ్యంతరాలు సమర్పించలేదు.. ఈసీ ప్రకటన

ఈ రోజు రక్షాబంధన్, నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న ప్రత్యేక రోజు. నా తమ్ముడి చేతికి రాఖీ కట్టి.. అతని ఆరోగ్యం, ఆనందం, ప్రతి కల నిజం కావాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఈ పవిత్ర క్షణం నా మనసును సంతోషం, ప్రేమతో నింపిందని పేర్కొన్నారు. అలాగే ప్రియమైన సోదరులారా, మీరు నా జీవితంలో ప్రతి సమయంలో నా కవచంలా, నా నమ్మకమైన తోడుగా ఇంకా నా ప్రాణ స్నేహితులుగా ఉన్నారని అన్నారు. మీ అందరికీ మంచి ఆరోగ్యం, మీ కలలను నెరవేర్చడానికి శక్తి, మీరు వేసే ప్రతి అడుగులో విజయం లభించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.

Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు

మనం పంచుకున్న ప్రతి జ్ఞాపకం నాకు అమూల్యం. నవ్వు, ప్రేమ, ఆనందంతో నిండిన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అలాగే ఈ రోజు రక్షాబంధన్‌ను జరుపుకుంటున్న ప్రతి సోదర సోదరీలకు, గడిచే ప్రతి రోజుతో మీ బంధం మరింత బలపడాలని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక ప్రార్థనలు, ప్రేమ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version