NTV Telugu Site icon

Rakesh Jhunjhunwala: ఇండియా వారెన్ బఫెట్ ఇక లేరు.. రాకేష్ ఝున్‌ఝన్ వాలా హఠాన్మరణం

Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala passes away: స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిగ్ బుల్ రాకేష్ రాకేష్ ఝున్ ఝున్ వాలా(62) ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఇండియాలో స్టాక్ మార్కెట్ దిగ్గజంగా ఎదిరిన ఝున్ ఝున్ వాలా ఇటీవల ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఉదయం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్న ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఉదయం 6.45 గంటలకు ఆస్పత్రికి తరలించే సమయంలోనే కన్నుమూశారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇండియాలో ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు ఝున్ ఝున్ వాలా. ఆయన ఆస్తుల విలువ దాదాపుగా 5 బిలియన్లు డాలర్లు ఉంటుందని అంచనా.

Read Also: Rashmika Mandanna: హీరోయిన్‌ అవ్వడానికి ఒక్క రాత్రి సరిపోదు..!

ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హుటాహుటిగా క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆస్పత్రినిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.

Stock Market Big Bull Rakesh Jhunjhunwala Passed Away | Ntv

ఝున్ ఝున్ వాలా ‘ఇండియా వారెన్ బఫెట్’గా పేరు తెచ్చుకున్నారు. వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆయన చివరిసారిగా ఆయన ప్రారంభించిన ఆకాశ ఎయిల్ లైన్స్ ప్రారంభ సమయంలో కనిపించారు. ఇటీవలే ఆకాశ ఎయిర్ లైన్స్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈయన హంగామా మీడియా, ఆప్ టెక్ చైర్మన్ గా కూడా ఉన్నారు. వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు డైరెక్టర్ గా కూడా ఉన్నారు.