RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. కానీ, డైరెక్టర్ అట్లీ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నాడనేది అంచనా వేయకుండా ఉంది. అయితే, రాకా లుక్ మాత్రం ఇదేదో కొత్త ప్రయోగంలా కనిపిస్తోంది. విచిత్రమైన అనిమల్‌ను పోలిన బన్నీ లుక్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రమని, మానవ డిఎన్ఏ మార్పుల వల్ల మనిషి ఒక క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో సూపర్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది.
అయితే, నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా గతంలోనే ఇలాంటి సినిమా చేస్తున్నాడని గట్టిగా నమ్మారు ఆడియెన్స్. స్టార్ హీరో విక్రమ్‌తో శంకర్ చేసిన ‘ఐ’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వస్తుందని.. రిలీజ్‌కు ముందు అంతా భావించారు. ఎందుకంటే, ఐ సినిమా కోసం విక్రమ్ చాలా కష్ట పడ్డాడు. ముఖ్యంగా క్రూరమైన మృగం లాంటి మేకోవర్ సినిమా పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేసింది. శంకర్ సినిమాలంటేనే ఊహకతీతంగా ఉంటాయి. ‘ఐ’ కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక.. రివేంజ్ లవ్ స్టోరీతో షాక్ ఇచ్చాడు శంకర్. అంతేకాదు, విక్రమ్ అనిమల్ లుక్‌ను జస్ట్ ఒక్క పాటతోనే సరిపెట్టాడు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది. కానీ, ఇప్పుడు ‘రాకా’ లుక్ చూస్తుంటే.. గురువు చేయలేనిది శిష్యుడు అట్లీ చేస్తున్నాడా? అనే సందేహాలు రాకమానదు. ఫక్తూ కమర్షియల్ సినిమాలు తీయడంలో అట్లీ దిట్ట. కానీ, రాకా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తన 18 ఏళ్ల కల అని చెప్పుకొచ్చాడు. కాబట్టి.. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. పైగా పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో.. రాకా కాన్సెప్ట్ అంత ఈజీగా ఉండదనే చెప్పాలి. మరి రాకా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!