Site icon NTV Telugu

‘Raju Weds Rambayi’ : కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’- డే 2 కలెక్షన్స్

Raju Weds Rambayi

Raju Weds Rambayi

అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఈ కల్ట్ మూవీ ఏపీ మరియు తెలంగాణ లో రెండు రోజుల్లోనే 4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో డామినేషన్ చూపిస్తూ, మొదటి రోజు రూ.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరు మీద దూసుకెళ్లి 2 కోట్ల వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లో నైజాంలోనే 3 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకోవడం చిన్న సినిమాలకు కంటెంట్ ఉంటే విజయం ఖాయం అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

Also Read : Spirit: మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం

డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చారు. అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్‌తో పాటు శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్‌తో ముందుకు సాగుతోంది.

Exit mobile version