Site icon NTV Telugu

Raju Gari Gadhi 4: మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన ‘రాజుగారి గది’.. సినిమా ఎప్పుడు వచ్చేదంటే?

Raju Gari Gadhi 4

Raju Gari Gadhi 4

Raju Gari Gadhi 4: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4: శ్రీచక్రం సినిమా దసరా 2026కు విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ‘రాజు గారి గది’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Philippinesలో భారీ భూకంపం.. 72కు చేరిన మృతుల సంఖ్య

దసరా పండుగ సందర్భంగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ రాబోయే ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. పోస్టర్‌లో ఎరుపు చీర కట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ కనిపిస్తుండగా, ఆమె ముందు శక్తివంతమైన కాళీ దేవత విగ్రహం కనిపిస్తుంది. ఈ దృశ్యం సినిమా ఆధ్యాత్మిక, అతీత శక్తుల నేపథ్యంలో ఉంటుందని అర్థమవుతుంది. “ఎ డివైన్ హారర్ బిగిన్స్” అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని భయానక అంశాలను తెలియజేస్తుంది.

IND vs WI: ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్!

ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, ఓంకార్ మార్క్ కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘శ్రీచక్రం’ కథ కాలికాపురం అనే గ్రామంలో జరుగుతుంది. ఇది కేవలం దెయ్యాల కథ మాత్రమే కాకుండా.. పురాతన విశ్వాసాలు, భయాలు, ఆత్మల చుట్టూ అల్లుకున్న ఒక ఆధ్యాత్మిక హారర్ కామెడీగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

Exit mobile version