Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఇండియా బ్లాక్, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనత పార్టీలు కలిసి దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్లాన్ చేశాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాల మాదిరిగానే భారత్‌లోనూ అశాంతిని రేపి అధికార మార్పిడికి ప్రయత్నిస్తోన్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలు హైడ్రోజన్ బాంబు కాదని.. చివరకు దివాళీ టపాకిలా కూడా పేలలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసినట్లుగా ఆరోపణలు ఏమాత్రం నిజం కాలేదని ఆయన తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ తన రాజకీయ లబ్ది కోసం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించేందుకు ప్రయత్నించారని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. 70 ఏళ్ల మహిళను రెండు చోట్ల ఓటరుగా చూపించారని, అలాగే 35 ఏళ్ల మహిళను ఏకంగా 124 ఏళ్ల వయసున్న ఓటరుగా తప్పుగా ప్రచారం చేశారని ఆయన గుర్తుచేశారు. సాధారణ పౌరులను సైతం ఫేక్ ఓటర్లుగా చిత్రీకరించి దేశంలో అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, చివరకు ఆరోపణలన్నీ కేవలం రాజకీయ నాటకాలుగానే తేలిపోయాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కావాలనే రాజకీయ ఘర్షణలను ప్రోత్సహిస్తున్నాయని, యువతను తప్పుదోవ పట్టించి వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని రాజ్‌నాథ్ ఆరోపించారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం, ప్రభుత్వాలను మార్చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం వంటి మాటలు మాట్లాడటం ద్వారా దేశంలో అరాచకత్వాన్ని సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే వారి కుట్ర అని విమర్శించారు. ఈ తరహా రాజకీయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమేనని పేర్కొన్నారు. అరాచకాలు సృష్టించేందుకు ఎవరికీ ఎలాంటి లైసెన్స్ లేదని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా స్పష్టం చేస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. నిత్యం అడ్డు తగిలే సంస్కృతిని మానుకుని, దేశాభివృద్ధి కోసం చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని రాహుల్ గాంధీకి ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనా కాలంలో జరిగిన ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, కరసేవకులపై కాల్పుల ఘటనలను ఆయన ప్రస్తావించారు. నేడు రాజ్యాంగ సంస్థలను దెబ్బతీస్తున్నారంటూనే, రాహుల్ గాంధీ స్వయంగా రాజ్యాంగాన్ని పాకెట్లో పెట్టుకుని అరాచకాలను సృష్టిస్తున్నారని విమర్శించారు.
Also Read
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. 1990లలో అర్ధరాత్రి పూట ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది కాంగ్రెస్ కాదా అని ఆయన నిలదీశారు. నవీన్ చావ్లాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన్ను కాపాడింది కాంగ్రెస్ పార్టీయేనని, అలాగే ఎం.ఎస్. గిల్‌ను సీఈసీని చేసి ఆ తర్వాత ఆయనకు రెండుసార్లు కేంద్రంలో మంత్రి పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. గతంలో ఓటరు గుర్తింపు కార్డులు లేనప్పుడే ఎన్నికలు జరిగేవని, ఎప్పుడైతే ఫొటో గుర్తింపు కార్డులు రావడం మొదలైందో అప్పటి నుంచే కాంగ్రెస్‌కు మెజారిటీ దూరమైందని, ఇకపై ఆ పార్టీ ఎప్పటికీ సొంత బలంతో అధికారంలోకి రాలేదని ఎద్దేవా చేశారు. ఇది ఓట్ల చోరీనా లేక కాంగ్రెస్ నాయకుల పనితన లోపమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తూ వచ్చిందని, వాటిపై ఎన్నడూ అనుమానాలు వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.
ఒక అభ్యర్థి మరణిస్తే ఆ ఆయా స్థానాల్లో మాత్రమే ఎన్నికలు వాయిదా పడతాయని, కానీ రాజీవ్ గాంధీ మరణించిన సమయంలో మాత్రం దేశవ్యాప్తంగా మొత్తం ఎన్నికల ప్రక్రియనే ఎందుకు నిలిపివేశారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో తమ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ హింసాత్మక మార్గాలను ఆశ్రయిస్తోందని, బంగ్లాదేశ్ తరహా అస్థిర పరిస్థితులను దేశంలో సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ సాయం లేకుండా రాహుల్ గాంధీ ఒక్కరే అమేథీలో గెలవగలరా అని ఆయన సవాల్ విసిరారు. సొంత పార్టీ కార్యాలయంలోనే దాడులు జరిగే పరిస్థితి ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు తమలో ఉన్న అరాచకత్వాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. తాము చేసిన ఓట్ల చోరీ ఆరోపణలు ఏమాత్రం నిలవకపోవడంతో రాహుల్ గాంధీ పరువు పూర్తిగా గాలిలో కలిసిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!