NTV Telugu Site icon

Vettaiyan Collections: రజనీ ‘వేట్టయన్‌’ రికార్డు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే?

Vettaiyan Collections

Vettaiyan Collections

Vettaiyan Day 1 Collections: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’. జై భీమ్ం సినిమా తీసిన దర్శకుడు టీజే జ్ఞాన‌వేళ్.. ఈ చిత్రంను తెరకెక్కించాడు. జై భీమ్ం ట్యాగ్ తప్పితే.. వేట్టయన్ రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ లేదు. ఎందుకంటే మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. తమిళ్‌లో ఆడియో ఫంక్షన్‌తో సూపర్ స్టార్ సందడి చేసినప్పటికీ.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా చేయలేకపోయారు. ఇక తెలుగులో అయితే రజనీ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందా? అనేది కూడా చాలామందికి తెలియకుండా పోయింది. అడ్వాన్స్ బుకింగ్సే ఇందుకు నిదర్శనం.

తెలుగులో టైటిల్ కూడా మార్చకపోవడం కూడా వేట్టయన్ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. అయినా కూడా అది రజనీకాంత్ సినిమా కాబట్టి ఆటోమేటిక్‌గా జనాలు థియేటర్లకు వెళ్లారు. మొదటి షోకే మంచి పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీంతో వేట్టయన్ తొలి రోజు మంచి వసూళ్లే రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.77.90 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సమాచారం. కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. దళపతి విజయ్‌ ‘ది గోట్‌’ మొదటి స్థానంలో (120 కోట్లు) ఉంది.

Also Read: PAK vs ENG: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ సంచలనం.. ఈ శతాబ్దంలో మొదటిసారి!

వేట్టయన్ తమిళనాడులో 25.65 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 4.89 కోట్లు, కర్ణాటక 7.90 కోట్లు, కేరళలో 4.72 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.34 కోట్లు, ఓవర్సీస్ 32.40 కోట్లు కలుపుకొని.. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 77.90 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వసూళ్లు రజనీ జైలర్ కంటే తక్కువేనని చెప్పాలి. కానీ ఈ ఏడాదిలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల జాబితాలో వేట్టయన్ చేరింది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు.

Show comments