NTV Telugu Site icon

Thalaivar 171 : రజినీకాంత్ సినిమా స్టోరీ లీక్.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Thalaivar171

Thalaivar171

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ కాంబోలో వస్తున్న సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం తలైవా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.. 80వ దశకంలో దేశాన్ని కుదిపేసిన బంగారం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. రజనీ క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా ప్రయోగాలు చేయబోతున్నారు. శృతిహాసన్ ఈ చిత్రంలో రజిన్ కూతురిగా నటించనుంది ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. రీసెంట్ గా నాగ్ మల్టీ స్టారర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు… ఇక ఈ సినిమాలో లగ్జరీ వాచ్ లను దొంగతనం చేసే దొంగ గా నటిస్తున్నాడు..