Site icon NTV Telugu

Vettaiyan OTT: ఆ ఓటీటీ చేతికే ‘వేట్టయాన్’ రైట్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Vettaiyan

Vettaiyan

Vettaiyan OTT: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తాజా ఇన్వెస్టిగేషన్ యాక్షన్ మూవీ ‘వేట్టయాన్’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆయన గత సినిమాలతో పోల్చితే తెలుగులో ఈ మూవీకి అనుకున్న స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ ఆశించినంతగా లేవు. ఈ సినిమా ‘టైటిల్’ వివాదం తలెత్తిన సంగతి కూడా తెలిసిందే. సినిమా థియేటర్లలోకి రావడంతో ఏ ఓటీటీలోకి వస్తుందా అని జనాలు ఆరా తీసుకున్నారు.

Read Also:Banjara Hills Crime: జువెలరీ షాప్‌ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం.. మేనేజర్ అనుమానం..

టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ. 140 కోట్లతో తెరకెక్కించింది. సూపర్ స్టార్ కెరీర్ లో 170వ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై ట్రైలర్ క్యూరియాసిటీ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం థియేటర్లలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ‘వేట్టయాన్’ మూవీకి సంబంధించి ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ ఏకంగా రూ. 65 కోట్లకు కొనేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్లతో ‘వేట్టయాన్’ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే అవకాశం లేదు. ఈ మూవీ సుమారు 3 నుంచి 4 వారాల్లోపే ఓటీటీలోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:Donald Trump: భారత్‌ అత్యధికంగా ట్యాక్స్ విధిస్తోంది.. చైనా, బ్రెజిల్‌లో కూడా..!

‘వేట్టయాన్’ మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తో పాటు మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, జీఎం సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Exit mobile version