Site icon NTV Telugu

Rajinikanth: పదేళ్ల తర్వాత యంగ్ హీరో సినిమాలో రజనీ గెస్ట్ రోల్

Rajinikanth

Rajinikanth

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారెవరూ ఉండరు. తను ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సాధాసీదాగా కనిపించినా.. స్టైలిష్ గా అదరగొట్టినా ఆయన నటనకు జనాలు నీరాజనాలు పడుతుంటారు. హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్తో జరుగుతుంది.

Read Also: Shruti Haasan: హాలీవుడ్ కు వెళ్తున్న శ్రుతి హాసన్

ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్న ఈ మూవీ లో ముఖ్య పాత్రలో కనిపిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. జైలర్ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Read Also: Brahmastra 2 : ‘బ్రహ్మాస్త్ర 2’ ను నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన డిస్నీ

ఇలా జైలర్ మూవీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ మరో మూవీ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఓ చిత్రంలో అతిథి పాత్రను పోషించబోతున్నారు. 2011లో వచ్చిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చిత్రం ‘రా వన్’ చిత్రంలో ఆయన చివరి సారిగా అతిథి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆయన చిట్టి రోబోగా కనిపించారు. తాజాగా, మరో చిత్రంలో గెస్ట్ రోల్ పోషించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read Also:Kantara: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా ‘కాంతారా’.. అలా అనొద్దంటున్న దర్శకుడు

రజీనీకాంత్ కూతురు ఐశ్యర్య దర్శకురాలిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అధర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమయింది. తన తండ్రి అతిథి పాత్రలో నటించేలా ఐశ్వర్య స్క్రిప్టును రెడీ చేశారు. గెస్ట్ రోల్ లో నటించాలన్న తన కూతురు కోరికకు రజనీ ఓకే చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Exit mobile version