తలైవా రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే సూపర్ స్టార్ హోదాలో వున్నా ఆయన ఎప్పుడు ఎంతో సింపుల్ గా ఉంటారు.తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ ‘వెట్టయాన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతోంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో తరువాతి షెడ్యూల్ కోసం చెన్నై బయల్దేరింది మూవీ టీమ్.
అదే సమయంలో సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కోసం చెన్నైకు బయల్దేరింది చెన్నై రైనోస్ టీమ్. అనుకోకుండా ఈ టీమ్ ఎయిర్ పోర్ట్ లో రజినీకాంత్ ని కలిసింది. అంతే కాకుండా ఆయనతో కలిసి టీమ్ మెంబర్స్ అంతా ఫోటోలు కూడా దిగారు. ముఖ్యంగా హీరో, చెన్నై రైనోస్ కెప్టెన్ అయిన జీవా అయితే రజినీతో కాసేపు ముచ్చటించి, ప్రత్యేకంగా ఫోటో కూడా తీసుకున్నారు. చెన్నై రైనోస్ టీమ్ కు తలైవా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చెన్నై రైనోస్ టీమ్ ఫ్లైట్ షేర్ చేసుకున్నారు. ఈ అనుకోని కలయిక వల్ల ఉత్సాహం పొందిన టీమ్.. కచ్చితంగా గెలుపును ఇంటికి తీసుకొస్తుంది’ అంటూ జీవా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు… అంతే కాకుండా రజినీకాంత్ తో ప్రత్యేకంగా దిగిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. జీవా మాత్రమే కాదు.. రజినీకాంత్ ని ఎకానమీ క్లాస్లో చూసిన కొందరు ఫ్యాన్స్ ఫోటోలను, వీడియోలను తీసుకున్నారు. అంతే కాకుండా కొందరు ఫ్యాన్స్ అయితే ఆయనతో ముచ్చటించే ప్రయత్నం కూడా చేశారు. తనతో మాట్లాడడానికి వచ్చిన ఫ్యాన్స్ తో రజినీ నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
#Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0
— Suresh balaji (@surbalutwt) February 29, 2024
