Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనాను సర్‌ప్రైజ్‌ చేసిన తలైవా..!

Rajinikanth Kangana Ranaut

Rajinikanth Kangana Ranaut

Rajinikanth Surprises Kangana Ranaut: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ను రజనీకాంత్‌ సర్‌ప్రైజ్‌ చేశాట. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే చెప్పింది. ఇంతకి ఏం జరిగిందంటే. కంగనా-ఆర్‌ మాధవన్‌ దాదాపు ఏనిమిదేళ్ల తర్వాత మరోసార జతకడుతున్నారు. తను వెడ్స్‌ మను సినిమాతో అలరించిన వీరిద్దరు ఇప్పుడు సైకాలజీకల్‌ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే విషయాన్ని కంగనా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ రోజు నా కొత్త సినిమా ప్రారంభమైంది. చెన్నైలో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. ఆర్‌ మాధవన్‌తో కలిసి ఓ సైకాలజీకల్‌ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాను. ఈరోజే షూటింగ్‌ కూడా మొదలైంది’ అని తెలిపింది.

Also Read: Domestic Violence: అత్తగారి ఇంట్లో ఉన్నది 11 రోజులే.. వరకట్న వేధింపుల కేసు..కోర్టు ఏం చెప్పిందంటే..

అలాగే తన మూవీ ఫస్ట్‌డే షూటింగ్‌ సెట్‌లోనికి భారత సినిమా దేవుడుగా పిలిచే తలైవా రజనీకాంత్‌ స్వయంగా వచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇది మా అందరికి మర్చిపోలేని రోజు. కానీ మ్యాడీ(మాధవన్) మాత్రం మిస్‌ అయ్యారు. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు’ అని కంగనా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌తో రజనీకాంత్‌ దిగిన ఫొటోను, తలైవా తనకు బొకే ఇచ్చి విష్‌ చేసిన ఫొటో్ను షేర్‌ చేస్తూ కంగనా ఆనందం వ్యక్తం చేసింది.

Also Read: World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి..?

Exit mobile version