Site icon NTV Telugu

Rajinikanth : రజినీ కాంత్ ఫ్యాన్స్ మండిపడ్డ వృద్ధురాలు.. కారణం ఏంటంటే?

Old Women

Old Women

తమ అభిమాన హీరో కోసం యూత్ ఏదైనా చేస్తారు.. వారి మీద అభిమానంతో హీరోలను ఒక్కసారి కలవాలని ఎన్నెన్నో కలలు కంటారు.. ఇక పండుగరోజు, పుట్టినరోజు.. సినిమా వేడుకల్లో వారిని చూడాలని.. కలవాలని ఆశపడతారు.. ఇక తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అంటే యూత్ కు ఒక దైవం.. ఆయనను కలవడానికి రోజు వందల మంది ఆయన ఇంటిముందు క్యూ కడతారు.. అలా ఆయన ఇంటి ముందు అభిమానులు వేచి ఉన్న సందర్భంలో ఓ పెద్దావిడకు తిక్క రేగింది. ఒక్కసారిగా అభిమానులపై విరుచుకుపడింది.. కారణం ఏంటో తెలుసుకుందాం..

హీరోను చూడాలని అభిమానులు ఆశపడతారు… పండుగ సందర్భాలలో వారికి ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పాలని ఆశపడుతుంటారు. ముఖ్యంగా పండుగరోజుల్లో సూపర్ స్టార్ ఇంటిముందు అభిమానులు రష్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రజనీకాంత్ బయటకు వచ్చి వారికి చేతులు ఊపి అభివాదం చేస్తుంటారు. శుభాకాంక్షలు చెబుతుంటారు. పొంగల్ సందర్భంలో రజనీకాంత్ చెన్నైపోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటిముందు అభిమానుల కోలాహలం కనిపించింది. ఎప్పటిలాగనే రజనీకాంత్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం చేసారు. ఇక ఫ్యాన్స్ సంబరంలో మునిగిపోయారు..

ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ వృద్ధురాలు తీవ్రంగా మండిపడింది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. రజనీకాంత్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఒక పెద్దావిడకి వేలాదిగా వచ్చిన అభిమానులతో సమస్య ఎదురైందట. తలైవా..తలైవా అని అరుస్తూ తమని ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారని పెద్దావిడ మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అభిమానులపై అంత ఇష్టం ఉంటే రజనీకాంత్ వారిని తమ ఇంట్లోకి పిలుచుకోవాలి కానీ తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తాము కూడా ఇంటి పన్ను కడుతున్నామని ఆవేదనతో చెప్పారామె. ఈ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. లాల్ సలామ్ లోని రెండవపాటతో పాటు.. వేట్టైయాన్ మూవీ ఫస్ట్ లుక్ కూడా పొంగల్ సందర్భంగా విడుదల కావడంతో అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.

Exit mobile version