NTV Telugu Site icon

Rajinikanth : రజినీకాంత్ విగ్రహానికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..

Rajinikanth (2)

Rajinikanth (2)

డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..

నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. పలువురు అభిమానులు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు. పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని మధురై లో రజినీ కాంత్ అభిమానులు ఆయనకు గుర్తుగా గుడి కట్టించారు.. రజినీకాంత్ విగ్రహం పెట్టి దానికి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న రజిని పుట్టిన రోజు కావడంతో ఆ గుళ్లో రజినీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు.. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం రజినీ ఓ ప్రాజెక్టు లో నటిస్తున్నారు..

Show comments