NTV Telugu Site icon

Jailer Movie Twitter Review : తలైవా కమ్ బ్యాక్ …. రూ.1000కోట్లు పక్కా మావ

Jailer Showcase

Jailer Showcase

Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు. ఈలలు గోలలతో నానా రచ్చ చేస్తుంటారు. నేడు ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబోలో వచ్చిన జైలర్ సినిమా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రజినీ గత చిత్రాల చేదు జ్ఞాపకాలన్నీ తొలగిపోయాయి. అలాగే నెల్సన్ గత చిత్రం బీస్ట్ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇద్దరికీ హిట్ తప్పనిసరి. ఆ కసి మీద తీసిన జైలర్ తమ దాహాన్ని తీర్చిందరన్న టాక్ వినిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జైలర్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా సమీక్షలు తెలుపుతున్నారు.

Read Also:Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!

రజనీ అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) , నెల్సన్ బీస్ట్ ప్లాఫ్ త‌ర్వాత ఇద్దరూ మాస్ కంబ్యాక్ ఇచ్చారని తెలుస్తోంది. క‌థ‌లోకి వెళితే పేరొందిన నాయకుడిని జైలు నుండి రక్షించేందుకు ఒక పెద్ద ముఠా ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ వారికి అడ్డుగా ఒకరు నిలబడతారు. ఆ వ్యక్తే టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్). వాస్తవానికి జైలులో ఉన్న నాయకుడు ఎవరు? ఆయనను తప్పించేందుకు వీరంతా ఎందుకు ప్రయత్నిస్తుంటారనే కథనంతో సినిమా సాగుతోంది. నెల్సన్ తన గత చిత్రాల మాదిరే డార్క్ కామెడీ ప్రయోగాన్ని వాడి సక్సెస్ అయినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టాడని, ఫస్ట్‌ ఆఫ్ సూప‌ర్బ్‌గా ఉంద‌ని, ఇంటర్వెల్ బ్యాంగ్ బాషా సినిమాను గుర్తు చేస్తుందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, నెల్సన్ మార్క్ కామెడీ పంచులు అద్భుతంగా పేలాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా జైల‌ర్‌తో ర‌జినీ అదరగొట్టేశాడని దట్ ఈజ్ తలైవా అనిపించేలా సినిమా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కేవలం సోషల్‌ మీడియా రివ్యూ మాత్రమే. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, కన్నడ స్టార్‌ శివరాజ్‌ వంటి దిగ్గజాలు కీలకపాత్రలు పోషించారు.

Read Also:High security: విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ

Show comments