Site icon NTV Telugu

Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ మూవీ షురూ.. వీడియో వైరల్..

Rajinikanth Thalaivar170

Rajinikanth Thalaivar170

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అయితే జైలర్ సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ ను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.. అక్కడ కూడా హిట్ ను అందుకుంది..

ఇకపోతే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్ పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తలైవా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..

తాజాగా విడుదలైన విజయ్ లియో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది..ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్‌ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రానా వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు..

Exit mobile version