NTV Telugu Site icon

Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్

Jailer

Jailer

Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు. వీటిన్నింటి నడుమ ఇక నేడు విడుదలైన జైలర్ మూవీ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందుకు కారణం ఫస్ట్ షో నుంచి తలైవా కమ్ బ్యాక్ అన్న టాక్ నడుస్తోంది. దీంతో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. సినిమాలో రజనీ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని టాక్. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన నువ్వు కావాలయ్యా సాంగ్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా హిట్ కావడానికి సాంగ్స్ కూడా కారణమే. తప్పకుండా రజినీ జైలర్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఈ సినిమాలో రజనీతో త‌మ‌న్నా, ర‌మ‌కృష్ణ, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. రజినీ సినిమాను పురస్కరించుకుని మెట్రో నగరాల్లో అన్ని కంపెనీలు ఆఫీసులకు హాలీడేస్ ప్రకటించాయి.

Read Also:Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు

సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేసింది. ఈ క్రమంలో చెన్నై ఆడియో లాంచ్ నిర్వహించారు. అందులో రజినీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ లో రజినీ తన పరువును హీరోయిన్ ముందు డైరెక్టర్ తీసేశాడని వాపోయాడు. జైల‌ర్ సినిమాను ద‌ర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రజినీ నటించే ఓ సీన్ ఫర్ ఫెక్ట్ గా రాలేదట. ఈ సీన్ కోసం రజినీ 8టేకులు తీసుకున్నాడట. దీంతో రజనీ హర్ట్ అయి నీలాంబరి ముందు నరసింహ పరువుతీసేశావు అంటూ ఆడియో లాంఛింగ్ వేడుకపై అభిమానుల ముందు సరదగా అన్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకాంత్ కు భార్యగా నటించింది. నరసింహ సినిమా తర్వాత వీరు కలిసి నటించ లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్యతో కలిసి రజనీ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు.

Read Also:Manipur MLAs: మణిపూర్ అల్లర్లపై మోడీతో భేటీ అయ్యేందుకు 40 మంది ఎమ్మెల్యేల ప్రయత్నాలు

Show comments