Site icon NTV Telugu

Rajinikanth Himalayas : సినిమా రిలీజ్ పెట్టుకుని హిమాలయాలకి వెళ్లిన సూపర్ స్టార్..

Whatsapp Image 2023 08 09 At 8.11.17 Pm

Whatsapp Image 2023 08 09 At 8.11.17 Pm

రజనీకాంత్​.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్​ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్​ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్​ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా “వా నువ్వు కావాలయ్య” సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది.

అయితే రేపు విడుదల కానున్న ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమా ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అమెరికాలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉండగా రేపు ఈ సినిమా విడుదల పెట్టుకుని సూపర్ స్టార్ రజనీ హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మనశ్శాంతి కోసం తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు.ఎన్ని పనులు వున్నా సూపర్ స్టార్ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్తారు. కానీ కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్ల నుంచి ఆయన హిమాలయాలకు వెళ్లడం లేదు. అందుకే జైలర్ సినిమా విడుదల ఉన్నా సరే హిమాలయాలకు వెళ్లిపోయారు.

Exit mobile version