NTV Telugu Site icon

Rajinikanth: వద్దంటే వినలేదు.. ఆయన వల్లే సినిమా ఫ్లాప్ అయింది.. రజనీకాంత్ పై డైరెక్టర్ ఆరోపణలు

New Project (81)

New Project (81)

KS Ravikumar on Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు సీనియర్ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్. తన వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఆరోపణలు చేశాడు. వీరి కాంబోలో గతంలో వ‌చ్చిన ముత్తు, న‌ర‌సింహా చిత్రాలు బ్లాక్ బ‌స్టర్ గా నిలిచాయి. ఇక ఈ కాంబోలో వ‌చ్చిన మూడో చిత్రం లింగ. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టించ‌గా.. కె.ఎస్‌.రవికుమార్ దర్శకత్వం వ‌హించారు. రజినీకాంత్ కెరీర్‌లో ‘లింగ’ ఓ డిజాస్టర్‌ సినిమాగా నిలిచింది. 2014లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను అందుకోలేదు. రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్ అయి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. దర్శకుడు రవికుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.

Read Also:Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డిప్యూటీ సీఎంఓను చంపేందుకు యత్నం.. ఆడియో లీక్

లింగ సినిమా గురించి చాట్ విత్ చిత్రా ఇంటర్వ్యూలో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ మాట్లాడారు. లింగ సినిమా క్లైమాక్స్‌లో ట్విస్టును రజినీకాంత్ పట్టుబట్టి తీసేశారని రవికుమార్ చెప్పారు. సెకండాఫ్‍ను పూర్తిగా మార్చేశారని వెల్లడించారు. గ్రాఫిక్స్ కోసం సమయం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. లింగ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో రజినీకాంత్ ఎక్కువగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. “రజినీకాంత్ ఎడిటింగ్‍లో చాలా జోక్యం చేసుకున్నారు. సీజీఐ కోసం కూడా నాకు టైమ్ ఇవ్వలేదు. ఈ మూవీ సెకండ్ హాఫ్‍ను పూర్తిగా మార్చేశారు. క్లైమాక్స్‌లో ఓ సర్‌ప్రైజ్ ట్విస్టు అనుకున్నాను. దానిని తీసేశారు. అనుష్క ఉన్న ఓ పాటను కూడా తీసేశారు” అని రవికుమార్ ఆరోపించారు.

Read Also:Harsha sai : హర్షసాయి కేసులో ట్విస్ట్.. దాసరి విజ్ఞాన్ అరెస్ట్..

లింగ చిత్రంలో ఓ ఫైట్‍లో బ్రిడ్జి మీద నుంచి హాట్ ఎయిర్ బెలూన్‍పైకి రజినీకాంత్ జంప్ చేస్తారు. ఈ సీన్‍పై అప్పట్లో ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే, ఆ బెలూన్ ఐడియా రజినీకాంత్‍దే అన్నట్టుగా రవికుమార్ వెల్లడించారు. ఆ సీన్ తన కెరీర్‌ను నాశనం చేసిందన్నారు. లింగ చిత్రాన్ని ఆ ఆర్టిఫిషియల్ బెలూన్ జంప్ సీన్ పూర్తిగా చెడగొట్టిందన్నారు. లింగ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. లింగేశ్వరన్, రాజా లింగేశ్వరన్ అంటూ రెండో పాత్రల్లో కనిపించారు. జగపతి బాబు, కే విశ్వనాథ్, సంతానం, కరుణాకరన్, బ్రహ్మానందం, దేవ్ గిల్, రాధా రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. లింగ చిత్రాన్ని రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై వెంకటేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతో డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌పై విమర్శలు వచ్చాయి.