NTV Telugu Site icon

Rajendranagar Crime: మార్నింగ్ వాక్‌ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు.. తల్లి, కూతురు మృతి

Road Acident

Road Acident

Rajendranagar Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న తల్లి కూతుర్లపై కారు దూసుకుపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదర్ షాకోట్ శాంతి నగర్ లో అనురాధ కుటుంబం నివాసం ఉంటుంది. రోజూ తన కూతురు తో కలిసి అనురాధ మార్నింగ్‌ వాక్‌ వెళ్లతూ ఉంటుంది. దీంతో రోజూలాగానే ఇవాళ ఉదయం బండ్లగూడ సన్ సిటీ వద్ద అనురాధ తన కూతురు మమత, కవిత అనే మహిళతో కలిసి మార్నింగ్ వాక్‌ కు వెళ్ళారు. మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వారిని విధి వక్రీకరించింది. కారు రూపంలో జీవితాలను ఛిదిలం చేసింది. ఫుట్‌ పాత్‌ పై మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. అంతేకాకుండా.. అక్కడే మార్నింగ్‌ వాకర్స్‌ పై కూడా దూసుకుని పొదల్లోకి వెళ్లింది. దీంతో తల్లి కూతురు అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కారు డ్రైవర్‌ కారు వదలి పారిపోయాడు.

కారులో బ్యాగ్ లభ్యం మయ్యింది. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో వున్న బ్యాగ్‌ను తీసి చూడగా షాక్‌ కు గురయ్యారు. బ్యాగ్ లో మారణ ఆయుధాలు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో కారు డ్రైవర్‌ ఎదైన నేరం చేసి పారిపోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే హడావిడిగా కారును నడపడం వల్లే మార్నింగ్‌ వాకర్స్‌ పై దూసుకుపోయివుంటుందని తెలిపారు. అంతేకాకుండా కారు డ్రైవర్‌ మద్యం సేవించి నడిపాడా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి పారిపోతున్న కారు డ్రైవర్ ను గమనించిన స్థానికులు, ఆర్మీ అధికారులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. కారు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించిన పోలీసులు వాహనం నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Eye Care: నిద్ర, శారీరక శ్రమ లేకపోతే కంటి చూపు మందగిస్తుంది