NTV Telugu Site icon

Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్

New Project (72)

New Project (72)

Rajendraprasad : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరగుతుందో ఎవరూ ఊహించలేదు. కొందరు చిన్న సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. కొందరు వంద సినిమాలు చేసినా స్టార్ డమ్ దక్కకపోవచ్చు. ఏది ఏమైనా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వారంతా ఎన్నో క‌ష్టాలు..ఒడిదుడుల‌కు ఎదురొన్నవారే. క‌ష్టమైనా ఇష్టపడి పని చేశారు కాబట్టే నేడు వారు సక్సెస్ సాధించారు. తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తన నట ప్రస్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మానాన్న స్కూల్ టీచర్. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇంజ‌నీరింగ్ అయిన వెంట‌నే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా. అందుకు ఆయ‌న ఒప్పుకోలేదు. అస‌హ‌నాన్ని వ్యక్తం చేశారు. నీ ఇష్టానికి వెళ్తున్నావ్. అక్కడ సక్సెస్ కావొచ్చు.. లేదా ఫెయిల్యూర్ ఎదురు కావొచ్చు. అది నీకు సంబంధించిన విష‌యం. ఒక‌వేళ ఫెయిలైతే ఇంటికి మాత్రం రావొద్దు అన్నారు. ఆ మాట నాపై చాలా ప్రభావం చూపించింది. మ‌ద్రాస్ వ‌చ్చి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరాను. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ సినిమాల్లో మాత్రం అవకాశం రాలేదు. వేషాలు వ‌చ్చే గ్లామ‌ర్ నాది కాద‌ని తెలుసు. ఆ స‌మ‌యంలో ఇంటికి తిరిగి వెళ్లాను. ఎందుకు వ‌చ్చావ్‌? రావొద్దు అని మొఖం మీదనే మా నాన్న కోప్పడ్డారు.

Read Also : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం

చాలా బాధగా అనిపించి వెంటనే రిటన్ వెళ్లి మద్రాస్ కు వచ్చేశాను. బాధతో చచ్చిపోదాం అనుకున్నాను. చివరిగా ఓ సారి నా ఆత్మీయులంద‌రిని చూడాల‌నిపించి వాళ్లను కలిసి మాట్లాడాను. చివ‌రిగా నిర్మాత పుండ‌రీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ మేల్కొలుపు సినిమాకు సంబంధించి ఏదో గొడ‌వ అవుతుంది. ఆఫీస్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి న‌న్ను చూసి ఏం మాట్లాడ‌కుండా న‌న్ను డ‌బ్బింగ్ రూంకు తీసుకెళ్లారు. ఓ సీన్ కి నాతో అక్కడ డబ్బింగ్ చెప్పించారు. అది ఆయ‌న‌కు న‌చ్చి స‌మ‌యానికి భ‌లే దొరికావ్ అన్నారు. రెండ‌వ సీన్ కి డ‌బ్బింగ్ చెప్పమనగానే నా ప‌రిస్థితి చెప్పాను. సరిగ్గా భోజ‌నం చేసి మూడు నెలలు అయింది. భోజ‌నం పెడితే డ‌బ్బింగ్ చెబుతానని అన్నారు. అవ‌కాశాలు రాక ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాను. దానికి ఆయ‌న కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, నాకు ధైర్యం చెప్పారు. అలా నా డ‌బ్బింగ్ ప్రయాణం మొదలైంది. అలా చాలా సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్పాను. వ‌చ్చిన డ‌బ్బులతో మ‌ద్రాస్ లో ఇల్లు క‌ట్టుకున్నాను. అక్కడే డైరెక్టర్ వంశీ పరిచయం అయ్యారు. ఆయన సినిమాలతోనే నాకు హీరోగా గుర్తింపు వచ్చింది’ అన్నారు.

Read Also :Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?