Virat Kohli : రాజస్థాన్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్న ( ఆదివారం ) రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాజస్థాన్ టీమ్ పై షాకింక్ కామెంట్స్ చేశాడు. నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీమ్ కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకు ఆలౌటైంది. ఇది ఐపీఎల్లో రాజస్థాన్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, ఐపీఎల్ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరుగా రికార్డ్ లోకి ఎక్కింది.
Also Read : SRH vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఎస్ఆర్హెచ్
Also Read
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
మ్యాచ్ తర్వాత RCB షేర్ చేసిన వీడియోలో, విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ రాయల్పస్ ప్లేయర్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారు అంటూ కామెంట్స్ చేశాడు. మ్యాచ్‌లో RCB బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ వేశారు. జట్టు తరపున ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ 3 ఓవర్లలో 10 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు మైకేల్ బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు తీశారు. బ్రేస్‌వెల్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇవ్వగా.. కర్ణ్ శర్మ 1.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో 10 పరుగులిచ్చి 1 వికెట్, గ్లెన్ మాక్స్ వెల్ 1 ఓవర్లో 3 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారు.
Also Read : Akhil Akkineni : ఏజెంట్ సినిమా రిజల్ట్‌పై స్పందించిన అఖిల్ అక్కినేని
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఓడి ఉంటే ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించేది. ఈ విజయం తర్వాత ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది.

Dressing Room Reactions RR v RCB
A near-perfect game, 2 points in the bag, positive NRR – that sums up the satisfying victory in Jaipur.
Parnell, Siraj, Maxwell, Bracewell and Anuj take us through the events that transpired and the road ahead.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/cblwDrfVgd
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2023
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!