NTV Telugu Site icon

RR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

Sanju

Sanju

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్ తాము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాము. మేము బలమైన బ్యాటింగ్ లైనఫ్ తో ముందుకు వెళ్తున్నట్లు శాంసన్ వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ 200వ మ్యాచ్ ఆడటం చాలా గొప్పగా అనిపిస్తుంది అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ అన్నారు. ఐపీఎల్ లో 10 సంవత్సరాలు ఆడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ గులాబీ రంగును చూడటానికి ఇష్టపడతాను, కానీ అది పసుపు రంగులో ఉంది మరియు దానికి కారణం (నవ్వుతూ) అని మాకు తెలుసు అంటూ ( ధోనిని ఉద్దేశిస్తూ ) సంజూ శాంసన్ అన్నాడు. ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు శాంసన్ పేర్కొన్నాడు. బౌల్ట్ స్థానంలో ఆడమ్ జంపాను టీమ్ లోకి తీసుకున్నాట్లు పేర్కొన్నాడు.

Read Also : Dakota Fanning: అడవిలో డకోటా ఫ్యానింగ్ ఏం చేయబోతోంది!?

ఈ పిచ్ మంచి పేస్ కలిగి ఉంది కానీ సగటు బౌన్స్ కొంచెం తక్కువగా ఉంది అని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని అన్నారు. మేము మా జట్టులో (బౌలర్లు) పాత్రలను నిర్మించడానికి మరియు వారిపై నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాము.. అదే మా గెలుపు కారణం అని ధోని పేర్కొన్నాడు.

Read Also : MP Dharmapuri Arvind : రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది

తుది జట్లు :
1. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(w/c), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్.
2. రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (w/c), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Show comments