Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి సరిగ్గా 24 గంటల ముందు.. అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆకాశమంతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరిన 20 ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దీనిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాయి. ఈ ప్రాజెక్టు ప్రస్థానం దశాబ్ద కాలం క్రితమే మొదలైంది. 2013లో అప్పటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పుడు దీని అంచనా వ్యయం సుమారు రూ.37,230 కోట్లు. 2018లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు. కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా దీని వ్యయం రూ.73,000 కోట్ల పైచిలుకు చేరుకుంది.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఈ రిఫైనరీ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. పాలిప్రొపిలిన్, పాలిథిలిన్, బెంజీన్ వంటి రసాయనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్లాస్టిక్ ఫర్నిచర్, అగ్రికల్చర్ పైపులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ , వైద్య పరికరాల తయారీకి ముడి సరుకుగా ఉపయోగపడతాయి.
ఈ కాంప్లెక్స్ చుట్టూ అనేక చిన్న , మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతను ఇది బలోపేతం చేస్తుంది. మొత్తానికి, ఈ ప్రాజెక్టు రాజస్థాన్ రాష్ట్రాన్ని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక పారిశ్రామిక కేంద్రంగా నిలబెట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంటలను
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?