Site icon NTV Telugu

Rajasthan Minister: సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మంత్రి తొలగింపు

Rajasthan Minister

Rajasthan Minister

Rajasthan Minister: మహిళల భద్రత విషయంలో తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాజేంద్ర గూడాను రాష్ట్ర మంత్రిగా తొలగించారు. రాజేంద్ర గూడా సైనిక్ కళ్యాణ్ (స్వతంత్ర బాధ్యత), హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Also Read: TS Govt: వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో సెలవులు పొడిగింపు

శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023పై చర్చ జరుగుతోంది. అయితే, మే 4న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన కాంగ్రెస్ సహచరులు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేయడంతో చర్చకు అంతరాయం ఏర్పడింది. మహిళలకు భద్రత కల్పించే అంశంపై గూడా తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తారు. రాజస్థాన్‌లో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మణిపూర్ అంశాన్ని లేవనెత్తే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్ర గూడా అన్నారు.

Exit mobile version