NTV Telugu Site icon

Rajasthan : ఎంత కష్టం వచ్చింది తల్లి.. నలుగురు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య..

Rajastan1

Rajastan1

ఓ కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకుంది.. తన కడుపున పుట్టిన నలుగురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. బార్మర్ జిల్లాలోని మాండ్లీ స్టేషన్ ప్రాంతం లో జెతారామ్ తన భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే.. శనివారం జేతారామ్ కూలి నిమిత్తం బాలేసర్ కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయం లో ఊర్మిళ తన పిల్లలు భావన, విక్రమ్, విమల, మనీషా లను వడ్లు నిల్వ ఉంచే గుమ్మిలలో పెట్టి మూతలు వేసింది…

ఆ తర్వాత ఓ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. ఆమె బంధువులు సడెన్ చూడటానికి వచ్చారు.. ఇంట్లో ఊర్మిళ ఉరి వేసుకుని వేలాడుతుండగా.. ఆమె పిల్లలను గుమ్మిలో లాక్ చేసి కనిపించారు. గ్రామస్థుల తో పాటు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు.. మృత దేహలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..

ఇక వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్లుగా తన అత్తింట్లో వేధింపులు ఉండటంతోనే చనిపోయిందని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు.. పోలీసుల వివరాల ప్రకారం.. భార్యా భర్తల మధ్య విభేదాలకు సంబంధించినదని పోలీసు అధికారి తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.