NTV Telugu Site icon

Rajasthan : అత్యాచారం కారణంగా ప్రెగ్నెంటైన బాలిక.. అబార్షన్ కు అనుమతివ్వని కోర్టు

New Project (71)

New Project (71)

Rajasthan : అత్యాచారం జరిగిన తర్వాత గర్భవతి అయిన 11 ఏళ్ల బాలిక ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వాలి. 31 వారాలలోపు గర్భాన్ని తొలగించుకునేందుకు రాజస్థాన్ హైకోర్టు నిరాకరించింది. బుధవారం నాడు బాలిక పిటిషన్‌నుహైకోర్టు తిరస్కరించింది. కోర్టు తన నివేదికలో .. ”పూర్తిగా అభివృద్ధి చెందిన పిండానికి కూడా జీవించే హక్కు ఉంది” అని తన నిర్ణయంలో పేర్కొంది. శుక్రవారం అందిన హైకోర్టు ఉత్తర్వు కాపీ ప్రకారం, మెడికల్ బోర్డు సలహా మేరకు పిండం బరువు పెరుగుతోందని.. దాని అన్ని ముఖ్యమైన అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందాయని జస్టిస్ అనూప్ కుమార్ దండ్ తెలిపారు.

Read Also:MLA Pendem Dorababu: పుట్టిన రోజు వేడుకల తర్వాత సైలెంట్‌ అయిన వైసీపీ ఎమ్మెల్యే..

“పిల్లవాడు ఇప్పుడు పుట్టడానికి సమయం దగ్గరలో ఉంది, కాబట్టి అబార్షన్‌ను అనుమతించలేము” అని జస్టిస్ ధండ్ అన్నారు. ఇలాంటి రెండు కేసులను విచారిస్తున్నప్పుడు పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా అబార్షన్‌కు అనుమతి నిరాకరించిందని ఉదాహరణగా తీసుకున్నారు. అబార్షన్ చేయడం వల్ల చిన్నారికి సురక్షితం కాదని, ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని మెడికల్ బోర్డు కూడా అభిప్రాయపడిందని హైకోర్టు పేర్కొంది. అత్యాచారం వల్లే బిడ్డ పుట్టిందని, తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇది తనకు నిరంతరం గుర్తుచేస్తుందని మైనర్ పిటీషన్ దాఖలు చేసింది. బిడ్డకు జన్మనివ్వడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. బాలికను ప్రభుత్వ ‘బాలికల గృహం’లో చేర్చుకోవాలని, ప్రసవానికి ముందు, తర్వాత మంచి ఆహారం, వైద్యంతో పాటు అవసరమైన ప్రతి సంరక్షణను అందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, ఆమెకు మెజారిటీ వచ్చే వరకు విద్యతో సహా ఇతర సౌకర్యాలు కల్పించాలని కోర్టు పేర్కొంది.

Read Also:Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్‌-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్..