NTV Telugu Site icon

Ashok Gehlot: ప్రధాని మోడీపై రాజస్థాన్ సీఎం ఆగ్రహం

Ashok Gehlot

Ashok Gehlot

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుక్జిందర్ సింగ్ రంధావా సమక్షంలో రాజస్థాన్ మైనారిటీ మోర్చా, హజ్ కమిటీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమీన్ పఠాన్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘మూర్ఖుల ప్రభువు’ ప్రకటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలాంటి విమర్శలు ప్రధానిగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే మంచిది కాదు.. ఎంత తక్కువ విమర్శలు చేస్తే అంత మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Kanguva: ఆరు ఫైట్స్… అందులో ఒకటి అండర్ వాటర్ ఎపిసోడ్

అయితే, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

Read Also: Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం.. సౌదీ అరేబియా మిలియన్ డాలర్ల సాయం

ఇక, మంగళవారంనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా బెతుల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ పేరు తీయ్యకుండానే.. మేడ్ ఇన్ చైనా అంటూ ఆయన చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని కామెంట్స్ పై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ మేడ్ ఇన్ చైనా మొబైల్ ఉందని ఆయన చెప్పారు. ఓ మూర్ఖుల నాయకుడా.. నువ్వు ఏ లోకంలో నివసిస్తున్నావు? తమ దేశం సాధించిన విజయాలు చూడకుండా ఇలా మాట్లాడటం సిగ్గచేటు అంటూ ఆయన విమర్శించారు.