Rajasthan: రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 రోజుల తర్వాత ఈ మధ్యాహ్నం మంత్రులకు శాఖలను అప్పగించారు. అత్యధికులు తొలిసారిగా మంత్రులుగా పనిచేసినవారే. మంత్రులకు బాధ్యతలు అప్పగించే ముందు బీజేపీ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంతో పోర్ట్‌ఫోలియో ప్రకటనకు కొంత సమయం పట్టింది. రాష్ట్రంలో కొత్త బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హోం మంత్రిత్వ శాఖతో సహా ఎనిమిది శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. డిప్యూటీ సీఎంలలో ఒకరైన దియాకుమారికి ఆర్థిక శాఖ, పర్యాటకం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) బాధ్యతలు అప్పగించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వాకు విద్య, రవాణా, ఆయుర్వేదంతో సహా ఆరు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.
ఇతర కేబినెట్ మంత్రుల్లో కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల శాఖలు, గజేంద్ర సింగ్ ఖిమ్సర్‌కు వైద్యారోగ్యం, రాజ్యవర్ధన్ రాథోడ్‌కు పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్.. మదన్ దిలావర్ పాఠశాల విద్యను కేటాయించారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత బాధ్యతలను అప్పజెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి..
కన్హయ్య లాల్‌కు-ప్రజారోగ్యం, ఇంజినీరింగ్, భూగర్భజల శాఖలు ఉన్నాయి, జోగారామ్ పటేల్‌కు- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, న్యాయ వ్యవహారాలు ఇవ్వబడ్డాయి. సురేష్ సింగ్ రావత్‌కు జలవనరుల శాఖ, అవినాష్ గెహ్లాట్- సామాజిక న్యాయం, సాధికారత, సుమిత్ గోదారా- ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలను కేటాయించారు. గిరిజన ప్రాంత అభివృద్ధి, హోంగార్డుల శాఖలను బాబులాల్ ఖరాడీకి అప్పగించగా, హేమంత్ మీనాకు రెవెన్యూ, వలసపాలన శాఖలు దక్కాయి.
