Indian Police Force : అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఆకట్టుకుంటున్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ మరియు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండగా ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఒకేసారి ముగ్గురు టాప్ యాక్టర్స్ ను దించేసింది. ఈ వెబ్ సిరీస్ లో శిల్పా శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ లో ఓ కాప్ యూనివర్స్ క్రియేట్ చేసిన రోహిత్ శెట్టి.. దానిని ఓటీటీలోకి కూడా ఈ వెబ్ సిరీస్ ద్వారా తీసుకొచ్చాడు.సింగం, సింగం రిటర్న్స్, సింబా మరియు సూర్యవంశి లాంటి కాప్ యూనివర్స్ సినిమాలను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు.
ఇక ఇప్పుడీ వెబ్ సిరీస్ లో మరో ముగ్గురు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్లను పరిచయం చేయబోతున్నాడు. వరుస బాంబు పేలుళ్లతో ఢిల్లీని వణికిస్తున్న టెర్రర్ గ్రూపును పట్టుకునే పనిలో భాగంగా ఈ ముగ్గురు ఆఫీసర్లు ఎలాంటి త్యాగాలు చేశారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.ఇదిలా ఉంటే ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (జనవరి 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రోహిత్ శెట్టి తన సినిమాల్లోలాగే ఈ సిరీస్ ట్రైలర్ ను కూడా పూర్తి యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశాడు. సిల్వర్ స్క్రీన్ పై అజయ్ దేవ్‌గన్, రణ్‌వీర్ సింగ్ మరియు అక్షయ్ కుమార్ లాంటి స్టార్లతో ఆ యాక్షన్ సీన్స్ చేయించిన రోహిత్.ఈ సిరీస్ లో కూడా సిద్ధార్థ్, వివేక్ మరియు శిల్పాలతో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ చేయించాడు.పవర్‌ఫుల్ యాక్షన్, అందుకు తగిన డైలాగులు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ ట్రైలర్ వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసింది.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!