Site icon NTV Telugu

KKR vs RR : టాస్‌ గెలిచి ఫీల్టిండ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌

Kkr Vs Rr

Kkr Vs Rr

ఐపీఎల్‌ 16వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. అయితే.. నేడు కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ మొద‌ట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది. ఇరుజ‌ట్ల‌ది ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ప‌ది పాయింట్లతో ఉన్న‌ రాజ‌స్థాన్ ఐదో స్థానంలో, కోల్‌క‌తా ఆరో స్థానంలో నిలిచాయి.

ఈ మ్యాచ్ గెలిస్తే నాలుగో ప్లేస్ సొంత‌మవుతుంది. అందుకుని రెండు జట్లు విజ‌యం కోసం హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. గ‌త మ్యాచ్‌లో బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన నితీశ్ రానా సేన ఆత్మ‌విశ్వాసంతో ఉంది. టోర్నీ ఆరంభంలో ద‌ర‌గొట్టిన సంజూ బృందం హ్యాట్రిక్ ఓట‌ముల‌తో ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. అందుక‌ని ఈ మ్యాచ్‌ను రాజ‌స్థాన్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనుంది. ఇరుజ‌ట్లలో నాణ్య‌మైన స్పిన్న‌ర్లు ఉన్నారు. జోస్ బ‌ట్ల‌ర్, య‌శ‌స్వీ జైస్వాల్ సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌డం రాజ‌స్థాన్‌కు క‌లిసి రానుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

Exit mobile version