Site icon NTV Telugu

Rajasingh Wife Usha Bai : రాజాసింగ్‌లో ప్రవహించేది కాషాయ రక్తమే

Rajasingh

Rajasingh

Rajasingh Wife usha Bai release press note

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి టి.ఉషా భాయి నేడు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ‘ రాజాసింగ్ లో ప్రవహించేది కాషాయ రక్తమే.. హిందూ ధర్మం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మాకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, రాజాసింగ్ అభిమానులకు, ధర్మ రక్షకులకు నమస్కారాలు..దేశం కోసం , ధర్మం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే రాజాసింగ్ గారు అదే ధర్మం కోసం జైళ్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సమయంలో హిందూ సమాజం, బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులంతా మాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇచ్చారు. రాజాసింగ్, ఆయన కుటుంబం అనాథ కాదు. ఇంత పెద్ద హిందూ సమాజం మాకు అండగా ఉంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పేరు చెప్పుకుంటూ కొందరు కుట్రలు చేస్తూ సొంత రాజకీయ లబ్ది కోసం ఆయనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. హిందుత్వ పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. రాజాసింగ్ ధర్మం కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజాసింగ్ కు జైళ్లు, కేసులు కొత్త కాదు. రాజాసింగ్ గారు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. రాజాసింగ్ చేతిలో ఉండేది కమలం జెండానే.. ఆయనలో ప్రవహించేది కాషాయ రక్తమే. ధర్మ రక్షణ కోసం రాజాసింగ్ ఎన్ని బాధలు, కష్టాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం సంఘటితంగా ఉండాలి. ధర్మం పేరుతో కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం.’ అని ఆమె ప్రకటనలో తెలిపారు.

Exit mobile version