Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని తన మనసులోని మాటను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బయట పెట్టారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు. గత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వెళ్లారన్నారు. నిధులు ఇటలీ నుండి తెస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి తెస్తారా చెప్పాలన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది మంచి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. ఎవరు ఫ్లోర్ లీడర్ అయినా 8 మంది ఎమ్మెల్యేలను కలిసిమెలిసి పనిచేస్తామన్నారు. నేను ప్రభుత్వాన్ని కూలగొడతా నని అనలేదన్నారు. ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు కేసులు పెడితే వాళ్లపైనే పెట్టుకోవాలని తెలిపారు.
Read also: CM YS Jagan: నేను విన్నాను.. నేను ఉన్నానని చెప్పా.. హామీ నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డా..
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ లు ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దిన్ ముందు ప్రమాణం చేయమని చెప్పాము.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లు అంత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రమాణం చేసామని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటి లతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని తెలిపారు. ఇచ్చిన గ్యారెoటిలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తోంది ? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటిలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా…? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని అన్నారు.
Raja Singh: ఆరు గ్యారెంటీలకు నిధులు ఆఫీస్ నుంచి తెస్తారా.. లేక ఇటలీ నుంచి తెస్తారా…?