Site icon NTV Telugu

The Raajasaab: ఇట్స్ అఫీషియల్.. రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్

Prabhas

Prabhas

డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్. సలార్, కల్కీ మూవీలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు డార్లింగ్. ఇప్పుడు మరోసారి రాజాసాబ్ తో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీజర్ త్వరలోనే వస్తుందనే టాక్ నడిచింది. తాజాగా చిత్ర యూనిట్ ది రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది.

Also Read:Rohit Sharma: నా దగ్గర బ్యాట్‌లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్

జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టును ప్రభాస్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. టీజర్ రిలీజ్ డేట్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఈ ఏడాది డిసెంబర్ 05న రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రకటనతో పాటు, ఉత్సాహాన్ని మరింత పెంచుతూ అద్భుతమైన కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Also Read:Gold Rates: పసిడి ధర పరుగులు.. నేడు మరింత పైపైకి

ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిని UV క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ పాన్-ఇండియన్ హర్రర్ కామెడీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి హర్రర్ పాత్రలో అలరించనున్నాడు.

Exit mobile version