NTV Telugu Site icon

Rajanikanth : యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా…

Whatsapp Image 2023 08 18 At 9.35.28 Am

Whatsapp Image 2023 08 18 At 9.35.28 Am

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే అద్భుతమైన టాక్ తో అదరగోడుతుంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.గత కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు..సాధారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా విడుదలకు కు ముందు మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్తారు.. గత రెండు మూడేళ్ళుగా కరోనా కారణంగా ఆయన హిమాలయాలకు వెళ్లలేదు. దీనితో ఆయన జైలర్ సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు.ఈ హిమాలయాల దర్శనం ఆయన ఎన్నో సంవత్సరాలుగా సెంటిమెంట్ గా పాటిస్తున్నారు. తాజాగా ఆయన హిమాలయాల దర్శనం తరువాత వరుసగా ఆశ్రమాలు మరియు దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నారు.

హిమాలయాల్లో ఆశ్రమాలను దర్శించి ఆశీర్వచనం తీసుకున్న సూపర్ స్టార్.. ఆతరువాత బద్రినాథ్ క్షేత్రంలో ఆ బద్రీనాధుని దర్శించుకున్నారు. బద్రీనాథ్ క్షేత్రంలో రజనీని చూసిన ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ తరువాత సూపర్ స్టార్ జార్ఖండ్‌ సిటీలో ఉన్న యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు.అక్కడ ఓ గంటసేపు ఆయన ధ్యానం చేశారు. ఆ సిటీ సమీపంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా రజినీ దర్శించుకున్నారు.ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న స్వామీజీలతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యోగానంద ఆశ్రమానికి వచ్చినట్లు రజనీకాంత్ స్వయంగా వారికీ వెల్లడించారు. రాంచీ సమీపంలో ఉన్న భైరవి, దామోదర్ నదీ సంగమం వద్ద ఉన్న ఆలయాన్ని కూడా ఆయన దర్శించి ప్రత్యేక హారతి, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Show comments