NTV Telugu Site icon

Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.

Whatsapp Image 2023 08 16 At 12.01.49 Pm

Whatsapp Image 2023 08 16 At 12.01.49 Pm

రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకొని వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ఒకరోజు ముందు రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక యాత్ర లో భాగంగా ఆయన రిషికేష్, బద్రీనాథ్,ద్వారక మరియు బాబాజీ కేవ్ ను సందర్శించనున్నారు.రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఒక వారం పాటు సాగనుంది సమాచారం. రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర గురించి ముందుగానే తెలుసుకున్న వీరాభిమాని ఆయన్ని ఎలాగైనా కలవాలి అని అనుకున్నాడు. అందుకు అతను చెన్నై నుండి ఉత్తరాఖండ్ కి కాలి నడకన బయలు దేరాడు దాదాపు 55 రోజుల పాటు నడిచాడు.చివరికి తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు.

రజినీకాంత్ ని ఉత్తరాఖండ్ లో ఆ వీరాభిమాని కలవడం జరిగింది.దీనితో రజినీకాంత్ ఆ అభిమానిని కలిసి ఎంతో ఆత్మీయంగా పలకరించారు. అంతే కాకుండా అతనికి ఆర్థిక సహాయం కూడా చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమాని చేసిన సాహసంతో పాటు రజినీకాంత్ దాతృత్వం గురించి సోషల్ మీడియాలో అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన జైలర్ మూవీ మూడు వందల కోట్ల మార్క్ ను దాటేసింది. ఇప్పటివరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ కి జైలర్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ సినిమా దుమ్మురేపుతోంది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి ఏపీ మరియు తెలంగాణాలలో 30 కోట్ల కు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలాగే 18 కోట్ల కు పైగా షేర్ ను రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి జైలర్ సినిమా భారీ మొత్తంలో లాభాలు తీసుకు వచ్చింది.జైలర్ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు.తమన్నా కూడా ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్రలో కనిపించింది.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

Show comments