Site icon NTV Telugu

Rajanikanth : జైలర్ ఒక సాధారణ సినిమాలగా అనిపించింది… కానీ..

Whatsapp Image 2023 09 19 At 10.56.03 Am

Whatsapp Image 2023 09 19 At 10.56.03 Am

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమాతో రజనీకాంత్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు.ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా ఏకంగా రూ.650 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులే తేల్చి చెప్పేసారు.. కానీ రజనీ కి మాత్రం ఈ మూవీ ఓ సాధారణ సినిమా లాగే అనిపించిందట.ఈ విషయాన్ని రజనీకాంతే స్వయం గా తెలిపారు.. జైలర్ సక్సెస్ మీట్ లో రజనీకాంత్ చెప్పిన ఆ మాట అందరినీ షాక్ కు గురి చేసింది. రజనీకాంత్ మాట్లాడుతూ “నిజం చెప్పాలంటే ఓ సాధారణ సినిమా లాగే జైలర్ సినిమా అనిపించింది.కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు అతను ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పాలి.. దీనిని అతడు ఓ సవాలుగా తీసుకున్నాడు” అని రజనీ తెలిపారు.

తన సూపర్ హిట్ సినిమా గురించి రజనీకాంత్ ఇలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ప్రేక్షకులు కూడా రజనీ చెప్పింది నిజమే కదా అనుకుంటున్నారు. ఈ సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ హైలైట్ అని మొదటి నుంచీ అందరూ చెబుతూనే ఉన్నారు. కావాలా సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రజనీ మేనరిజానికి అచ్చు గుద్దినట్లు సరిపోవడంతో జైలర్ సూపర్ హిట్ అయింది.అదే విషయాన్ని సక్సెస్ మీట్ లో రజనీ తెలియజేశారు.. రీరికార్డింగ్ కంటే ముందు తాను జైలర్ సినిమా చూసినప్పుడు ఓ యావరేజ్ మూవీలాగే నాకు అనిపించిందని, అయితే రీ రికార్డింగ్ తర్వాత ఓ రేంజ్ లో ఉందని రజనీ తెలియజేశారు.. ఇక జైలర్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది.

Exit mobile version