Rajanikanth : జైలర్ ఒక సాధారణ సినిమాలగా అనిపించింది… కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమాతో రజనీకాంత్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు.ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా ఏకంగా రూ.650 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులే తేల్చి చెప్పేసారు.. కానీ రజనీ కి మాత్రం ఈ మూవీ ఓ సాధారణ సినిమా లాగే అనిపించిందట.ఈ విషయాన్ని రజనీకాంతే స్వయం గా తెలిపారు.. జైలర్ సక్సెస్ మీట్ లో రజనీకాంత్ చెప్పిన ఆ మాట అందరినీ షాక్ కు గురి చేసింది. రజనీకాంత్ మాట్లాడుతూ “నిజం చెప్పాలంటే ఓ సాధారణ సినిమా లాగే జైలర్ సినిమా అనిపించింది.కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పాలి.. దీనిని అతడు ఓ సవాలుగా తీసుకున్నాడు” అని రజనీ తెలిపారు.
తన సూపర్ హిట్ సినిమా గురించి రజనీకాంత్ ఇలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ప్రేక్షకులు కూడా రజనీ చెప్పింది నిజమే కదా అనుకుంటున్నారు. ఈ సినిమాలో అనిరుధ్ మ్యూజిక్ హైలైట్ అని మొదటి నుంచీ అందరూ చెబుతూనే ఉన్నారు. కావాలా సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రజనీ మేనరిజానికి అచ్చు గుద్దినట్లు సరిపోవడంతో జైలర్ సూపర్ హిట్ అయింది.అదే విషయాన్ని సక్సెస్ మీట్ లో రజనీ తెలియజేశారు.. రీరికార్డింగ్ కంటే ముందు తాను జైలర్ సినిమా చూసినప్పుడు ఓ యావరేజ్ మూవీలాగే నాకు అనిపించిందని, అయితే రీ రికార్డింగ్ తర్వాత ఓ రేంజ్ లో ఉందని రజనీ తెలియజేశారు.. ఇక జైలర్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!