NTV Telugu Site icon

Rajani 171 Movie: రజని మూవీ టైటిల్, టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

66

66

తలైవర్ 171 పేరుతో తాజాగా లోకేశ్ కనగరాజ్‌తో రజనీకాంత్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్‌ ని మేకర్స్ విడుదల చేశారు. లోకేశ్ కనగరాజ్‌తో తరచుగా సహకరించేవారిలో సంగీత దర్శకుడు అనిరుధ్, స్టంట్ డైరెక్టర్లు అన్బరీవ్ కూడా తలైవర్ 171లో ఉన్నారు. ప్రస్తుతం రజనీతో కలిసి వెట్టయాన్‌ లో కూడా వీరు పనిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీతో ఎంథిరన్, పెట్టా, అన్నాత్తే , జైలర్ వంటి చిత్రాలతో జతకట్టిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇకపోతే., కైతి, విక్రమ్, లియో చిత్రాలతో కూడిన తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో తలైవర్ 171 భాగం కాదని లోకేశ్ కనగరాజ్‌ కాదని తెలిపాడు.

Also Read: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు

ఈ సినిమా సంబంధించి తాజాగా రజిని క్రేజీ లుక్ తో పాటు అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ లో రజిని క్రేజీ లుక్ తో సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చేతులకు బేడీలు మాదిరిగా వాచీలను పెట్టుకొని, వాటితో పాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అల్ట్రా స్టైలిష్ గెటప్ లో రజనీకాంత్ కనిపిస్తున్నాడు.

Also Read: Nallamilli Ramakrishna Reddy: ప్రజల ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. అనపర్తి టికెట్‌ దక్కకపోవడంతో..!

ఇక ఈ సినిమా సంబంధించి టీజర్ తోపాటు టైటిల్ ను కూడా ఏప్రిల్ 22 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. రజిని 171 వ సినిమాగా ఈ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారాన్ నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.