Rajamouli Avatar 3: దర్శకధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు టాలీవుడ్ సరిహద్దు దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల తర్వాత జక్కన్న – సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాను రాజమౌళి ‘వారణాసి’ అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సినీ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తుంది. వాస్తవానికి ఈ వార్త హాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే..
అవతార్ 3 సినిమాలో ‘వారణాసి’ సర్‌ప్రైజ్ ఉండనున్నట్లు తాజాగా హాలీవుడ్ మీడియా పేర్కొంది. వాస్తవానికి రాజమౌళికి ‘అవతార్’ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అంటే ఎంత అభిమానమో తెలిసిన విషయమే. జక్కన్న సందర్భం వచ్చినప్పుడల్లా కామెరూన్‌పై తన అభిమానాన్ని చాటుతూనే ఉన్నారు. తాజాగా జక్కన్న వారణాసి సర్‌ప్రైజ్‌ను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ 3’ సినిమాలో ప్లాన్ చేసినట్లు వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న ‘అవతార్ 3’ విడుదల కానుంది. ఈ సినిమాలో జక్కన్న టీం ‘వారణాసి’కి సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించే ఆలోచన చేస్తున్నట్లు హాలీవుడ్ మీడియా తాజాగా పేర్కొంది. ‘వారణాసి’ సినిమా 2027 వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
READ ALSO: Anil Ambani: అనిల్ అంబానీ మెడకు ఈడీ ఉచ్చు.. రూ.1,120 కోట్ల విలువైన ఆస్తి జప్తు..
