తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.పాన్ వరల్డ్ దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.ఈయన మహేష్ బాబుతో ఒక సినిమా ను తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోందని సమాచారం.అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.
రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేసే సమయంలోనే తన తరువాత చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని తెలియజేశారు. ఇదేవిధంగా మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సమయంలోనే తన తరువాత చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు సోషల్ మీడియా లోవార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజమయితే ఎన్టీఆర్ ఖాతాలో మరొక భారీ బ్లాక్ బాస్టర్ ఖాయమని సమాచారం.ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి తన మొదటి సినిమాను ఎన్టీఆర్ తో చేసే సమయంలోనే వీరు క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిన విషయాన్ని రాజమౌళి పలు సందర్భాలలో కూడా తెలియజేశారు.అందుకే రాజమౌళి ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్లో సినిమా రావడానికి మరో మూడు సంవత్సరాలు సమయం అయినా కచ్చితంగా పడుతుందని అనుకుంటున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా తను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈయన కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. అలాగే ఎన్టీఆర్ హిందీ సినిమా అయిన వార్ 2 లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే