Site icon NTV Telugu

Rajamouli : బాహుబలి ప్రమోషన్స్ కు డబ్బు కాదు మైండ్ ఉపయోగించాం..

Whatsapp Image 2024 05 08 At 1.56.36 Pm

Whatsapp Image 2024 05 08 At 1.56.36 Pm

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్‌కు తాము అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేదని  తెలిపారు.రాజమౌళి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. సినిమాలో ప్రతి అంశం ఎంతో రిచ్ గా కనిపిస్తుంది.రాజమౌళి తన సినిమాకు అద్భుతమైన మేకింగ్‌ ఎంత ముఖ్యమో దానికి తగ్గట్టు ప్రమోషన్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతారు.దానికోసం భారీగా డబ్బు ఖర్చు చేసి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగేలా చేస్తారు.

‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ను ఆస్కార్ రేసులో నిలబెట్టేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ‘బాహుబలి’కి సినిమాకు మాత్రం కేవలం మౌత్ టాక్ తోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది.తాజాగా రాజామౌళి దానిని వెల్లడిస్తూ..నేను ఎప్పుడు నా సినిమాల నుండి ఎక్కువ ఆశించను అలాగని తక్కువ ఆశించను నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండటానికి ప్రయత్నిస్తానని రాజమౌళి తెలిపారు. నా సినిమాలకు కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలనే ఆలోచన నా మదిలో ఎప్పుడూ ఉంటుంది’ అని రాజమౌళి అన్నారు. ”బాహుబలి ప్రమోషన్‌ కోసం మేం అస్సలు డబ్బులు పెట్టలేదు. అలాగే ఎలాంటి వెబ్‌సైట్ కోసం డబ్బు ఇవ్వలేదని ఆయన తెలిపారు. కానీ ఆ సినిమా ప్రమోషన్ కోసం తాము చాలా హోంవర్క్ చేసామని ఆయన తెలిపారు.ముఖ్యంగా మా టీం సరికొత్తగా ప్రమోట్ చేసేలా మా బ్రెయిన్ ఉపయోగించాము అని తెలిపారు.

Exit mobile version