NTV Telugu Site icon

Telugu Mahasabhalu: నేటి నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ తెలుగు మహా సభలు

Telugu Mahasabalu

Telugu Mahasabalu

ఆదికవి నన్నయ నడిచిన నేల రాజమండ్రిలో ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు నేటి నుంచి ఆదివారం వరకు స్థానిక గైట్‌ కళాశాల ప్రాంగణం ఆతిథ్యమిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు గవర్నర్లు, నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు, ఇద్దరు కేంద్రమంత్రులు ఈ సభలకు హాజరు కాబోతున్నారు.

Read Also: Aditya- L1: తుది దశకు ఆదిత్య ఎల్-1 ప్రయాణం.. 6న గమ్యస్థానానికి శాటిలైట్..

కాగా, కళాశాల ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడి పేరుతో ప్రధాన వేదిక, ఆదికవి నన్నయ, కవి నారాయణభట్టు వేదికలను రెడీ చేశారు. తొలి రోజు ప్రారంభోత్సవానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇవాళ సాయంత్రం 72 మంది తెలుగు వెలుగులు కుటుంబ సభ్యులకు పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. తొలి రోజు ఇతర వేదికలపై కవి సమ్మేళనాలు, సదస్సులు, అష్టావధాన కార్యక్రమాలు ఉండనున్నాయి. రేపు సాయంత్రం ‘తెలుగు తోరణం’ నృత్యరూపక ప్రదర్శన, విశిష్ట సేవాపురస్కారాలను ప్రధానం చేయనున్నారు. ఎల్లుండి (ఆదివారం) అంతర్జాల వేదికగా కవి సమ్మేళనం ఉండనుంది. రాజరాజనరేంద్రుడికి 1,000 మంది కవులు 1000 కవితలతో నీరాజనం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరించుకుని గైట్‌ ప్రాంగణంలోని ప్రధాన వేదికల దగ్గర ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతుంది.

Show comments