NTV Telugu Site icon

Rajalinga Moorthy Murder Case: రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను కలిసిన పౌర హక్కుల సంఘం నేతలు

Rajalinga Moorthy Murder Ca

Rajalinga Moorthy Murder Ca

Rajalinga Moorthy Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర,ఉమ్మడి జిల్లా,జిల్లా కమిటీ ల నేతలు శుక్రవారం కలిశారు. రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజనిర్ధారణ చేసుకునేందుకే పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరిగిన హత్యపై పలువురు స్థానికులను, రాజలింగమూర్తి భార్యను కలిసి వివరాలు సేకరించుకున్నాము,మరికొంత సమాచారం కొరకు పోలీసులను కూడా కలవనున్నామని తెలిపారు. సామాజిక కార్యకర్తగా ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములపై పోరాటం సాగించాడని, మేడిగడ్డ బ్యారేజ్ కొంగుబాటుపై కోర్టులో కేసు వేయగా విచారణకు ముందు రోజే హత్యకు గురి కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఎఫ్ఐఆర్లో మృతిని భార్య ఇచ్చిన సమాచారం కాకుండా వేరే సమాచారాన్ని నమోదు చేయడం అనుమానాలకు తావిస్తుందని, హత్య జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆ స్థలం నుంచి వెళ్లి తరలించడంలో పోలీసుల అత్యుత్సాహం కూడా అనుమానంగా వుందని వారు తెలిపారు.

డీఎస్పీ సంపత్ రావు రాజలింగమూర్తిని పిలిపించిన రోజే హత్యకు గురి కావడం ఏంటని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం కోసం పోరాడే వారిని ఎవరు చంపిన నేరమే అని వారు వ్యాఖ్యానించారు. మృతుని భార్య తెలుపుతున్నట్లుగా కేసుతో సంబంధం ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి,హరిబాబు మరి కొంత మంది పేర్లు ఆందోళనకరంగా ఉన్నాయని, న్యాయ నిర్ధారణ చేసే హక్కు పోలీసులకు లేదన్నారు. కేసుతో ఎవరెవరికి సంబంధం ఉందో తెలియాల్సి ఉందని, జరిగిన హత్యపై మృతుని భార్య కోరినట్లుగా సిబిసిఐడిచే విచారణ జరిపించాలి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందే,,,నిజంగా లక్షల కోట్ల అవినీతి జరిగితే బయటికి చెప్పవలసిందేనని, కేసును బలహీనపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించిన,హంతకులు ప్రవర్తించిన అది మరొక నేరంగా పరిగణించాల్సిందేనని, ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీసీఐడీకి అప్పగించి బాధితులకు న్యాయం జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Kedar Selagamsetty: నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ.. 100 కోట్ల అప్పు!