Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో మత్స్యకారులు అతడికి ఒడ్డుకు చేర్చారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
షేక్ షాదీ ఖాన్ వేధింపులు, మోసాల కారణంగానే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నూకరాజు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయంగా ఉంటానని నమ్మించి షేక్ షాదీ ఖాన్ మోసం చేశాడని ఆరోపించారు. తన మనవడు కార్తీక్ రెడ్డికి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తూ.. కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించాడని లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన డబ్బులు, విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలు షేక్ షాదీ ఖాన్ ఆధీనంలోకి వెళ్లాయని నూకరాజు తెలిపారు. తన కుమార్తె సౌజన్య భర్త ఈ ఏడాది జూలై 2న మృతి చెందిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
షేక్ షాదీ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను నూకరాజు కోరారు. ప్రస్తుతం గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్య కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, గజ ఈతగాళ్ల బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనకు అసలు కారణాలు ఏమిటి, సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!