Site icon NTV Telugu

Alliance Air: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాజమండ్రి టూ తిరుపతి విమాన సర్వీసు

Alliance Air

Alliance Air

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. తిరుపతి టూ రాజమండ్రి.. రాజమండ్రి టూ తిరుపతికి అలయన్స్ ఎయిర్ సర్వీసు ప్రారంభించనున్నది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. వారంలో మంగళ, గురు,శని వారాల్లో సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల 40 ని.లకు రాజమండ్రి నుండి బయలుదేరి11 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటారు. ఉదయం 7గంటల 40 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి 9గంటల 25 నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు.

Exit mobile version