Butchaiah Chowdary: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనత అని సిటీ ఎమ్మెల్యే వాసు ప్రకటించుకోవడాన్ని గోరంట్ల తప్పుపట్టారు. 1985లోనే ఎన్టీఆర్ స్వయంగా ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రణాళికలు రచించారని, ఆ సమయంలో భూముల కేటాయింపులో తానూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాను వేసిన కృషిని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజన తర్వాత విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి కేసీఆర్ ఎంతగా అడ్డుకున్నాడో వివరించారు. అయితే, తాను 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబుతో అనేకసార్లు చర్చించి తెలుగు విశ్వవిద్యాలయం రావడానికే కృషి చేశానని తెలిపారు.
Read Also: Penukonda: సైకిల్ తొక్కి ‘సైకిల్ యాత్ర’ను ప్రారంభించిన మంత్రి సవిత..!
నా చరిత్ర తెలియని వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఎవరో కన్న బిడ్డకు నేను తండ్రి అన్న సామెత గుర్తొస్తోంది అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. రాజమండ్రి అభివృద్ధిలో తన పాత్రను ఎవరూ ఖండించలేరని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం మైదానంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను చేసిన అభివృద్ధి పనులన్నింటిని ప్రజలకు వివరంగా తెలియజేస్తానని చెప్పారు. అంతేగాక, గత ఏడాది కాలంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని గోరంట్ల ప్రశ్నించారు. “ఫ్లెక్సీలు పెట్టుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఇంకా ఏం చేశారు?” అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Cuts Off Private Part: భర్త ప్రైవేట్ పార్ట్ కోసిన భార్య… ఆపై యాసిడ్ తాగి ఆత్మహత్యయత్నం..!
