Site icon NTV Telugu

The RajaSaab : రాజాసాబ్ సెకండ్ ట్రైలర్.. జోకర్ దెబ్బకు మారిన కథ

Rajasaab

Rajasaab

నిన్న మొన్నటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా అంచనాలను తారుమారు చేసేసింది రాజాసాబ్ సెకండ్ ట్రైలర్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతేకాదు.. తనపై జరిగిన ట్రోలింగ్, విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. రాజాసాబ్ ఏదో వింటేజ్ డార్లింగ్‌ లుక్‌తో వచ్చే సాదా సీదా హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నారు.

Also Read : MSVP : మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. రంగంలోకి రామ్ చరణ్‌?

కానీ అసలు కథ వేరే ఉందని కొత్త ట్రైలర్‌లో రివీల్ చేశాడు. ప్రభాస్ వింటేజ్ లుక్‌ను ముందు నుంచి హైలెట్ చేస్తు వచ్చిన మారుతి.. ఇది రొటీన్ దెయ్యం కథ కాదని, దీని వెనుక ఒక బలమైన నానమ్మ-మనవడి ఎమోషన్ ఉందని ట్రైలర్‌తో చెప్పేశాడు. ఈ ఎమోషనే సినిమాకు ప్రాణం పోసేలా ఉంది. అలాగే.. ప్రభాస్ ఓల్డేజ్ లుక్‌ పీక్స్‌లో ఉంటుందనేలా ఉంది. నానమ్మ గంగమ్మ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వావ్ అనిపించాడు మారుతి. ట్రైలర్‌ కట్‌లో మాత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రభాస్ జోకర్ లుక్. ఎవ్వరు ఊహించని విధంగా ట్రైలర్ చివర్లో ప్రభాస్‌ జోకర్ లుక్ రివీల్ చేసి.. సినిమా పై ఉన్న అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు మారుతి. ప్రస్తుతం ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అసలు ప్రభాస్ లాంటి హీరోతో జోకర్ గెటప్ అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం తేడా కొట్టిన సరే.. సోషల్ మీడియాలో జరగబోయే ట్రోలింగ్‌ ఊహకందకుండా ఉంటుంది. కానీ, మారుతి చెప్పినట్టుగా రాజాసాబ్‌ బలమైన కంటెంట్‌తో రాబోతున్నట్టుగా అర్థమవుతోంది. మరి జనవరి 9న థియేటర్లోకి రానున్న రాజాసాబ్ ఎలా అలరిస్తాడో.

Exit mobile version